నగరి త్రినేత్రం న్యూస్. కార్మికులపై తెస్తున్న రాజకీయ ఒత్తిడిలను ఆపాలి.
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు డిమాండ్
చిత్తూరు పట్టణ పరిధిలోని ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో వంట చేయు కార్మికుల విస్తృత సమావేశం యూనియన్ అధ్యక్షురాలు జయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథు గా ఏ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య ,ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు, చిత్తూరు పట్టణ కార్యదర్శి దాసరి చంద్ర ,వర్కింగ్ ప్రెసిడెంట్ రమాదేవి పాల్గొని మాట్లాడుతూ ,ప్రభుత్వ పాఠశాలలో పనిచేయు మధ్యాహ్నం భోజనం పథకం కార్మికులు సుమారు ఇరవై సంవత్సరాలుగా మహిళా కార్మికులు పనిచేయు చున్నారు .వారికి సరైన జీతాలు లేకపోయినా వంట చేసి పిల్లలకు పెడుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్న ప్రతి సారి కార్మికులను మార్చాలి అనుకోవడం, స్థానిక చోట మోట నాయకులు రోజురోజుకు కొన్ని సెంటర్లలో కార్మికులను మార్చాలి అనుకోవడం తప్పని అన్నారు.
కార్మికుల పై రాజకీయ ఒత్తిళ్లు నుంచి కాపాడాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యాం లో ,రాష్ట్ర వ్యాపిత ఉద్యామం చేపడతామని అన్నారు. అధికారంలో వచ్చిన వెంటనే ప్రభుత్వ పాఠశాలలో వంట చేయు కార్మికులను జీతాలు పెంచుతాము, అని చెప్పి పది నెలలు కావస్తున్న ఇచ్చిన హామీలను నిత్యవసర ధరలు పెరుగుతున్నకొద్ది, పిల్లలకి ఇచ్చే మెస్ డబ్బులు 30 రూపాయలకు పెంచి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము. గత ప్రభుత్వం ఉద్యోగ కార్మికులకు అన్యాయం చేసినందువలన ఈరోజు అందరూ కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మహిళా కార్మికులపై పని నుంచి నిలిపివేస్తామని ఒత్తిడి తీసుకొస్తూ బలవంతంగా పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టి తీసేస్తామని బెదిరించడాన్ని మానుకోవాలి.ఈరోజు ఉద్యోగ కార్మికులు ప్రజలందరూ పెద్ద ఎత్తున తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం వలన అధికారం చేపట్టడం జరిగింది.
మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వమే ఉచిత సిలిండర్ ఇప్పించాలని వంట సామాగ్రిలను ఇవ్వాలని, గుర్తింపు కార్డులు ఇచ్చి రిటైర్మెంట్ బెనిఫిట్ క్రింద ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ,ప్రతి నెల 7000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జిల్లాలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు , ప్రభుత్వ పాఠశాలలో పనిచేయ ఆయామ్ములు లకు ఉద్యోగ భద్రత కల్పించి వారిని ఆదుకునే విధంగా స్థానిక అధికారులకు సూచనలు ఇవ్వాలని కోరారు.
అధికారులు ఒత్తిళ్లకు లొంగకుండా కార్మికులను కొనసాగించాలని ఏఐటియుసి కోరుతున్నది.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ఏ ఐ టి యు సి జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు, ఐఐటిసి పట్టణ కార్యదర్శి దాసరి చంద్ర , వర్కింగ్ ప్రెసిడెంట్ రమాదేవి ,ఏఐటిసి నాయకులు మనీ, లత ఆంధ్రప్రదేశ్ డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం కార్మికుల యూనియన్ నాయకులు రాజేశ్వరి ,రాణి, సెల్వి, సుశీల, సుమ, మహాలక్ష్మి ,ఢిల్లీ భాయ్, సరస్వతి ,ఆ.ప్ర. మధ్యాహ్న భోజన పథకం యూనియన్ కార్మికులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


