Public Durbar : పెనుమూరులో ప్రజా దర్బార్ నిర్వహించబడును

TRINETHRAM NEWS

పెనుమూరు త్రినేత్రం న్యూస్. పెనుమూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో 15/3/25 తారీకున అనగా శనివారం ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగునని గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ వి థామస్ పేర్కొన్నారు.

మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మన శాసనసభ్యులు థామస్ ఆధ్వర్యంలో పెనుమూరు మండలానికి సంబంధించిన ప్రజా సమస్యలు వినతి పత్రాలు ద్వారా ఫిర్యాదులు స్వీకరించి అధికారులతో చర్చించి సత్వరం సమస్యలు పరిష్కరించబడు నని తెలియజేయుచున్నాము.

ఫిర్యాదుదారులు తప్పనిసరిగా వారి యొక్క ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు మీరు ఇచ్చే వినతిపత్రంలో నమోదు చేయవలెనని కోరుచున్నాను. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మరియు ఎన్డీఏ నాయకులు పాల్గొని మండల ప్రజల సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని కోరుచున్నాము.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

public durbar is held

You cannot copy content of this page

Scroll to Top