స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలి

TRINETHRAM NEWS

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అర్ధ. సుధాకర్ రెడ్డి
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గం. ఈరోజు వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న అసెంబ్లీలో తెలంగాణ శాసనసభ సభాపతి వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ పై టిఆర్ఎస్ శాసనసభ్యుడు జగదీష్ రెడ్డి అహంకారపూరిత వ్యాఖ్యలు చేసినందుకు ఒక దళిత స్పీకర్ను అవమానించినందుకు నిరసన తెలుపుతూ స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు జగదీశ్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీష్ రెడ్డిని శాసనసభ సభ్యత్వన్ని రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది BRS పార్టీ దళితుడు స్పీకర్ అయినందుకు ఓర్వలేకపోతున్నారని కెసిఆర్ నిరంకుశత్వానికి నిన్న అసెంబ్లీలో జరిగిన సంఘటన ఒక నిదర్శనమని తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారని సరైన సమయంలో టిఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం నేర్పిస్తారని ఇలాంటి సంఘటనలు ఇకపై జరుగుతే చూస్తూ ఊరుకోమని హెచ్చరించడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

membership of Jagadish Reddy

You cannot copy content of this page

Scroll to Top