కామ్రేడ్ యు రాములు పోరాట స్ఫూర్తితో బలమైన కార్మిక పోరాటాలు నిర్మిద్దాం
వర్ధంతి సభలో జూపాక శ్రీనివాస్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి.సిపిఐ మాల్ మాస్ లైన్ ప్రజా పంథా
గోదావరిఖని మార్చి-13// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సిపిఐ మాల్ మాస్ లైన్ ప్రజా పంథా ఆధ్వర్యంలో కార్మిక ఉద్యమ నేత అమరుడు కామ్రేడ్ యు రాములు 21వ వర్ధంతి సభను ఎన్టీపీసీ ఆఫీసులో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ మాల్ మాస్ లైన్ ప్రజా పంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సంఘటిత సంఘటిత రంగ కార్మిక వర్గం కోసం తన ఊపిరి ఉన్నంతకాలం పోరాడిన గొప్ప విప్లవకారుడు కార్మికోద్యమ నేత కామ్రేడ్ యు రాములన్న ఈనాడు మన మధ్య లేకపోవడం కార్మిక ఉద్యమానికి విప్లవోద్యమానికి తీరని లోటు.
సింగరేణి కార్మికుల హక్కుల కోసం ఎన్ టి పి సి అసంఘటితరంగా కార్మిక వర్గ శ్రేయస్సు కోసం అహర్నిశలు పోరాడి అనేక హక్కులు సాధించాడు. నేడు సింగరేణి సంస్థ ఎన్టిపిసి యాజమాన్యం కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చూస్తూ పోరాడి సాధించుకున్న హక్కుల పై దాడిని తీవ్రతరం చేస్తున్నది. కార్పొరేట్ అనుకూల విధానాలను ప్రభుత్వం అనుసరిస్తున్నది. ఏ ప్రభుత్వం వచ్చినా కార్పోరేట్ శక్తుల చేతిలో బందీలుగా మారుతున్న పరిస్థితి ఉంది. కామ్రేడ్ యు రాములు పోరాట స్ఫూర్తితో ఈ ప్రాంతంలో బలమైన కార్మిక పోరాటాలు నిర్మించాలి. కామ్రేడ్ యు రాములు కలలు కన్న కార్మిక హక్కులకై, రాజీలేని పోరాటాలు కొనసాగించాలి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కార్మికుల నిర్మించుకున్న కామ్రేడ్ యు రాములన్న స్మారక స్తూపాన్ని తిరిగి నిర్మించుకునేందుకు విప్లవ శ్రేణులంతా ముందుకు రావాలని విప్లవ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలిపేందుకు స్థూపాన్ని తిరిగి నిర్మించుకుందామని పిలుపునిచ్చారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ మాల్ మాస్ లైన్ ప్రజా పంథా జిల్లా నాయకులు గూడూరి వైకుంఠం,గొల్లపల్లి చంద్రయ్య ,మార్త రాములు, కోడిపుంజుల లక్ష్మి, ఇనుగాల రాజేశ్వర్, తూళ్ళ శంకర్, కలవల రాయమల్లు, పెండ్యాల రమేష్, మార్త రాద తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


