జూన్ 26, 2026
TRINETHRAM NEWS

పెద్దపల్లి, మార్చి-12 // త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. కాల్వ శ్రీరాంపూర్ తహసిల్దార్ గా పని చేస్తున్న పుల్లూరు జగదీశ్వర రావు రచించిన బాలల కథల పుస్తకం లిటిల్స్ ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో ఆవిష్కరించారు
24 కథల బాలల పుస్తకం తెలుగు ఆంగ్ల భాషలలో అందుబాటులో ఉందని, సైన్స్ ను అందరికీ ముఖ్యంగా విద్యార్థులకు తెలిసే లా చక్కగా చిన్న చిన్న కథలు చెప్పడం జరిగిందని, ఈ పుస్తకాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలల గ్రంధాలయాలకు కానుకగా అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పాలనాధికారి శ్రీనివాస్, కాల్వ శ్రీరాంపూర్ నాయక్ తహసిల్దార్ శంకర్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

children's story book Littles

You cannot copy content of this page