అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం త్రినేత్రం న్యూస్ మార్చి 13 : ఈ నెల 14వ తేదీన జరగబోయే పిఠాపురం చిత్రాడ గ్రామంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ (ప్లీనరీ) నిర్వహణకు అవసరమైన ప్రణాళికతో జనసేన పార్టీ ముఖ్య నేతలతో ఆవిర్భావ దినోత్సవ వేడుకల యొక్క విధి విధానాలు మంతనాలు జరుపుతున్న జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ వంపూరు గంగులయ్య అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం, వివరాల్లోకి వెళితే ఈ సందర్భంగా వంపూరు గంగులయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభ పార్లమెంట్ సమన్వయ కర్త సాంస్కృతిక విభాగం కమిటీ సభ్యులు గా ఇచ్చిన బాధ్యతను సక్రమంగా అమలు చేసే విధానంలో పట్టుదలగా నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు.
నాకు ఇటువంటి బాధ్యతలు అప్పగించిన పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. నిరంతరం జనసేన పార్టీ బలోపేతానికి అహర్నిశలు శ్రమించి కృషి చేస్తానన్నారు. అలాగే జనసేన పార్టీ స్థాపన ఒక మహా శక్తి అని సామాన్యులకు న్యాయం కోసం రొమ్ము విరిచి నిలబడ్డ ఒకే ఒక్క పార్టీ జనసేన పార్టీ అని అన్నారు.పాడేరు నియోజకవర్గం నుండి జనసైనికులు, నాయకులు క్రమశిక్షణ తో కలిసి ఆవిర్భావ సభకు చేరుకోవాలని,అలాగే ఈ విజయోత్సవ ఆవిర్భావ సభ విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు.
అలాగే మనం అందరం సమిష్టిగా జనసేన కుటుంబ సభ్యులు గా ఆవిర్భావ సభ జయప్రదం చేయవలసిన బాధ్యత మన మీద ఉందనే విషయం మరువకూడదని తెలిపారు.అందరం ఒక పండుగల చేసుకోని క్షేమంగా వచ్చి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని పిలుపునిచ్చారు.మన జననేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆవిర్భావ సభ ఆమోదించిన కమిటీ సభ్యులకు, వాలంటీర్లకు, పోలీస్ సిబ్బంది, అధికారులకు సహకరించవలసినదిగా కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


