త్రినేత్రం న్యూస్ నగరి. అంగన్వాడి కార్యకర్తలకు జీతాలు పెంచి అంగన్వాడి యొక్క సమస్యలు పరిష్కరించాలనీ కోరుతూ పదో తారీఖున చలో విజయవాడలో జరుగు మహాధర్నాన్ని జయప్రదం చేయండి,.. ఏ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య పిలుపు
అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని గతంలో సమ్మె సందర్భంగా అప్పటి ప్రభుత్వం చర్చలు సందర్భంగా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది వేతనాలు కూడా 2024 జూలైలో పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ గత ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విపలమైనందున సమ్మె సందర్భంగా అప్పటి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అంగన్వాడీ కార్యకర్తల సమ్మె సందర్భంగా శిబిరాల వద్దకు వచ్చి మేము అధికారానికి వస్తే జీతాలు పెంచి మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సందర్భంగా నూటికి 95 మంది కార్మికులు ఉద్యోగస్తులందరూ కూటమి ప్రభుత్వానికి ఓటు వేయడం జరిగింది అధికారం చేపట్టి తొమ్మిది నెలలకు కావస్తున్న ప్రభుత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కనీసం స్పందించలేదు.
ప్రభుత్వంలో కదలిక రావాలని ఈనెల 10వ తారీఖున అంగన్వాడి వర్కర్స్ రాష్ట్ర కార్మిక సంఘాలైన సిఐటియు ఏఐటియుసి ఐఎఫ్టియు మూడు యూనియన్ల ఆధ్వర్యంలో చలో విజయవాడకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వేతనాలు పెంచుతామని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
అంగనవాడి కార్యకర్తలను స్థానిక ఉన్న పీడీ సిడిపివోలు సూపర్వైజర్లు ప్రతి నెల 31తారీకు లోపు సెక్టార్ మీటింగ్లు జరుగుతున్నాయి ఇది ఆనవాయితీగా జరిగే మీటింగ్లో కానీ చలో విజయవాడకు పిలుపు ఇచ్చిన తర్వాత ఈనెల 10వ తారీఖున సెక్టార్ మీటింగ్ ఉంది అందరూ రావాలని నోటీసులు ఇవ్వడాన్ని ఏఐటియుసిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అంగన్వాడి కార్యకర్తలను భయాందోళనలకు గురి చేసే విధంగా అధికారుల వైఖరి ఉన్నది .
ఇప్పటికైనా అధికారులు తమ వైఖరి మార్చుకొని అంగన్వాడి కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను వారి సమస్యలు పరిష్కరించే దానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శాసన మండలిలో అంగన్వాడి వాళ్లకి శ్రీ సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ అంగన్వాడి సమస్యలు పరిష్కరించడానికి ముందుంటామని అంగన్వాడీ కార్యకర్తలకు మట్టి ఖర్చులు కింద పదైదు వేలు,అంగన్వాడి కార్యకర్తలకు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద లక్ష రూపాయలు ఆయమ్మలకి 40,000/- వేలు ,అంగన్వాడి టీచర్లో వయోపరిమితిని 60 నుంచి 62 పెంచుతామని ప్రకటించడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలోని హామీలు ఇవ్వడం జరిగింది. హామీలను అమలుపరుస్తూ వేతనాలు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంఘాల నాయకులను పిలిచి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఏఐటీయుసీగా డిమాండ్ చేస్తున్నాము.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


