P.Appalanarasa : హైవే అదారిటి అధికారుల నిర్లక్ష్యం తగదు, కాంట్రాక్టర్ చొరవ తీసుకొని దుమ్ము,ధూళి నివారించాలి

TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( అల్లూరిజిల్లా ) జిల్లా ఇంచార్జ్ : వరుస ప్రమాదాలపై
హైవే అథారిటీ అధికారుల నిర్లక్ష్యం తగదు.

కాంట్రాక్టర్ చొరవ తీసుకుని దుమ్ము, ధూళి నివారించాలి.

జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి.

లమ్మసింగి నుండీ వయా జి.మాడుగుల పాడేరు మీదుగా NH 516 E హైవే రోడ్డు పనులు లో దుమ్ము, ధూళి పొగతో కూడుకుని రోడ్డు పక్కన గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. శ్వాస కోశ రోగులు,వృదులు,గర్భిణీలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు.అలాగే ఒకవైపు అధిక దుమ్ము లేవడం వల్ల వాహనదారులు రోడ్డు కనిపించక నిత్యం చాలా ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

ఈ రోడ్ మార్గం లో చింతపల్లి,జి.మాడుగుల మండలం లో ఉన్నత అధికార్లు నిత్య ప్రయాణం సాగిస్తున్నారు.కానీ జోక్యం చేసుకుని నివారించే చర్యలు తీసుకోవడం లేదు.
ప్రయాణికులకు రోడ్డు పక్కన ఉన్న గ్రామాలకు రాకపోకలు జరుగుతున్న వాహన దారులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా కనీసం రోడ్లకు నీళ్లు తడిపితే దుమ్ము లెగకుండా ఉండే చర్యలు కూడా అరకొరగా ఉంది. గ్రామాల్లో ప్రజలు సంత కార్యక్రమాలకు, ఆసుపత్రికి, ఇతర వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా రోడ్ మార్గం లో ప్రయాణాలకు సహకారం అందించాలని అధికారాలకు కోరారు.
జాతీయ రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారాలకు కోరారు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే తీవ్రమైన ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. అని
గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి. అప్పలనరస మీడియా ముందు డిమాండ్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

highway authorities is unacceptable

You cannot copy content of this page

Scroll to Top