AITUC : మార్చి 7 న జరిగే సి అండ్ ఎండి లెవెల్ మీటింగ్ లో మా సమస్య పరిష్కారం కోసం కృషి చేయండి.

TRINETHRAM NEWS

గుర్తింపు సంఘం ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య వినతి పత్రం ఇచ్చిన
మారుపేర్లు, విజిలెన్స్ బాధితులు.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 7,8 తేది లలో హైదరాబాద్ లో జరిగే సి అండ్ ఎండి స్థాయి సమావేశంలో మా సమస్య ను పరిష్కరించాలని కోరుతూ మారుపేర్లు, విజిలెన్స్ బాధితుల డిపెండెంట్ లు గుర్తింపు సంఘం ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య బుధవారం గోదావరిఖని భాస్కర్ రావు భవన్ కు వచ్చిన సందర్భంగా వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సీతారామయ్య మీ సమస్య పరిష్కారం కోసం ఎల్లుండి జరిగే సి అండ్ ఎండి లెవెల్ మీటింగ్ లో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేశ్ కుమార్ తో పాటు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

C&Md level meeting

You cannot copy content of this page

Scroll to Top