32వ డివిజన్ నందు ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కార్యక్రమం

TRINETHRAM NEWS

*32వ డివిజన్ నందు ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కార్యక్రమం *

రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కార్యక్రమాన్ని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, రూరల్ ఇంచార్జీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకు 32 వ డివిజన్ కార్పొరేటర్ తాళ్లూరు అవినాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా నాయకులు, కార్యకర్తలతో కలసి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు అనే అంశాన్ని ప్రజలకు వివరిస్తూ పార్టీ కార్యకర్తలు, నాయకులు నినాదాలు చేశారు. అనంతరం డివిజన్లోనే 3వ సచివాలయం పరిధిలో పార్టీ జెండాను డివిజన్ కార్పొరేటర్ తాళ్లూరు అవినాష్ కార్యకర్తల హర్షద్వానాలు మధ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో 35డివిజన్ ఇంచార్జ్ యాకసిరి శరత్ చంద్ర , 41 వ డివిజన్ అధ్యక్షులు కువ్వాకొల్లు బాబ్జి యాదవ్, క్లస్టర్ 4 అధ్యక్షులు బెజవాడ మేగనాధ్ సింగ్ స్థానిక డివిజన్ నాయకులు రెహ్మాన్ ,tlf అధ్యక్షురాలు హరిత రెడ్డి,నీళ్ల పెంచలమ్మా శశికళ, రిజ్వనా,మంద పెంచలమ్మా ,ప్రసాద్, మంజూర్ శివ, రవీంద్ర రెడ్డి, సుభాని, షమ్మీ, షఫీ, ఫయాజ్ ,కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top