WhatsApp Image 2024 01 10 at 10.22.38 AM
భర్త మరణం తట్టుకోలేక భార్య ఆత్మహత్య
Trinethram News : హైదరాబాద్:జనవరి 10
భర్త మరణించిన 15 రోజుల తరువాత బాధతో భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ధూల్‌పేటలోని ఆరాంఘర్ కాలనీకి చెందిన అస్మిత (31), అమన్‌కుమార్ సింగ్(36)ను పెళ్లి చేసు కుంది. ఈ దంపతు లకు రోనక్, రిత్విక్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. అమన్ కుమార్ సింగ్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
డిసెంబర్ 26న బిపి ఎక్కువ కావడంతో బ్రెయిన్ స్ట్రోక్‌తో దుర్మరణం చెందాడు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
గత పదిహేను రోజుల నుంచి ఫొటో దగ్గర పెట్టు కొని అస్మిత మనస్తాపానికి లోనైంది. మంగళవారం సాయంత్రం ఆరాంఘర్ కాలనీలో పుట్టింట్లో చున్నీ తో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు..
