TRINETHRAM NEWS

పేరా బత్తుల విజయానికి అందరూ మద్దతు ఇవ్వండి…

ఎమ్మెల్సీ ఎన్నికలలో రాజశేఖర్ ను భారీ మెజారిటీతో గెలిపిద్దామాన్న ఎమ్మెల్యే గోరంట్ల…

Trinethram News : కూటమి ప్రభుత్వం తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు కడియం మండలం కడియపులంక గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఎం.పీ.పీ వెలుగుబంటి సత్య ప్రసాద్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు లతో కలిసి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు.

ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమ ఫలాలు సామాన్య ప్రజానీకానికి అందాలన్నా కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని, కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, నిరుద్యోగ నిర్మూలన, పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ముందుకు సాగుతుందని, నిరుద్యోగులకు ఉపాధి కల్పన ధ్యేయంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు.

ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు ఉభయగోదావరి జిల్లాల పట్టబద్రుల సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్నారని, పేరాబత్తుల విజయానికి అందరూ మద్దతు తెలపాలని, ఈనెల 27వ తేదీన జరిగే పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును పేరాబత్తుల రాజశేఖర్ కు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షుడు వెలుగుబంటి రఘురాం, సర్పంచ్ పాఠంశెట్టి రాంజీ, మార్గాని సత్యనారాయణ, బోడపాటి గోపి, గట్టి సుబ్బారావు, బొరుసు సుబ్రమణ్యం, బొరుసు వెంకటేశ్వరరావు, సత్తి వెంకటగిరి, బొరుసు శేషగిరి, పడమట వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App