ప్రతినిధి త్రినేత్రం న్యూస్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా నవపేట్ మండల్ మాదారం గ్రామంలొ చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ డి.బి. శీతల్ మరియు న్యాయవాదులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తి వివాదాలగురించి అప్పు పాత్రలగురించి బాల్య వివాహాల గురించి బాల కార్మికులు గురించి వివరించారు. మరియు పోలీసులకు ఫిర్యాదు చేసినది మొదలు కోర్టులో జడ్జిమెంట్ వచ్చేంతవరకు జరిగే విధి విధానాలను గ్రామస్తులకు క్లుప్తంగా వివరించారు.
అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిగె అనర్థాల గురించి వివరించారు. ఈ సమావేశానికి హాజరైన జిల్లా న్యాయ సెవాదికార సంస్థ నుంచి వచ్చిన అందరికీ సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ టి. వెంకటేష్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం. శ్రీనివాస్, గ్రామ పంచాయతీ కార్యదర్శుల, సర్పంచ్ భాద్యతలు నిర్వహిస్తున్న స్పెషల్ అధికారులు మరియు మాజీ సర్పంచ్ ఇతర గ్రామస్తులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


