తేదీ :15/02/2025. కర్నూలు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కర్నూల్ మెడికల్ కళాశాలలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. యం బిబి యస్. రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్గొనడం జరిగింది . వెంటనే గమనించిన తోటి విద్యార్థులు ఆమెను ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అనంతరం ఆమె స్వస్థలం అనంతపురం గా తెలుస్తోంది. అయితే ఆత్మహత్య యత్నానికి గల కారణాలు తెలియవలసి ఉంది.


