TRINETHRAM NEWS

డాన్స్ చేస్తూ కుప్పకూలి ఇంటర్ విద్యార్థిని మృతి

Trinethram News : మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల/ కళాశాలలో నిన్న రాత్రి పదో తరగతి విద్యార్థులకు ఫేర్‌వెల్ పార్టీ కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి.. డీజే సౌండ్ బాక్స్ లను ఏర్పాటు చేశారు

ఈ క్రమంలో మరిపెడ మండలం తానం చర్ల శివారు సపావట్ తండాకు చెందిన సీఈసీ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని సపావట్ రోజా (16).. వేదికపై డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది

వెంటనే తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు రోజాను మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

student died