పంట కాలువల్లో కి మృతి చెందిన కోళ్లు
తేదీ : 04/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నరసాపురం మండలం, జిన్నూరు పంట కాలువలో మృతి చెందిన కోళ్లను సంచి గోనుల్లో మూటలుగా కట్టి కాలువల్లో పడేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా మృతి చెందిన కోళ్లు కాలువ ఎంబడి కొట్టుకు రావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నర్సాపురం మండలం, కొప్పర్రు, మల్లవరం గ్రామాల్లో జల వనరుల శాఖ డి ఈ ఈ సిహెచ్ వెంకటనారాయణ పరిశీలించడం జరిగింది. పంట కాలువల్లో పడేసే కోళ్ల పారాలపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App