జూన్ 26, 2026

WhatsApp Image 2025 02 03 at 18.09.41

TRINETHRAM NEWS

పేరాబత్తుల రాజశేఖరాన్ని అఖండ మెజార్టీతో గెలుపించండి

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ పిలుపు … 11వ డివిజన్‌లో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
రాజమహేంద్రవరం : ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరానికి ఓట్లు వేసి అఖండ మెజార్టీతో విజయం చేకూర్చాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) పిలుపునిచ్చారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరానికి మద్దతుగా స్థానిక 11వ డివిజన్‌లో పరిశీలకులు బోళ్ల వెంకట కృష్ణ ప్రసాద్‌, కూటమి నాయకులు కాశి నవీన్‌ కుమార్‌, అత్తి సత్యనారాయణ, వర్రే శ్రీనివాసరావు, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధా, వై శ్రీను, పిక్కి నాగేంద్ర, యెనుముల రంగబాబు, కురగంటి సతీష్‌ తదితర నాయకులతో కలిసి డివిజన్‌ ఇన్‌ఛార్జ్‌ కంటిపూడి రాజేంద్రప్రసాద్‌ పర్యవేక్షణలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా సదరు డివిజన్‌లో గ్రాడ్యుయేట్‌ ఓటర్లను కలిసి తమ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖరానికి ఓట్లు వేసి గెలుపించాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజశేఖరానికి ఒక్క అవకాశం ఇస్తే పట్టభద్రుల ప్రయోజనాలను కాపాడుతారన్నారు. నిరుద్యోగుల సమస్యలనూ ప్రభుత్వం దృష్టికి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు.

ఏడేళ్ల తర్వాత ప్రజా ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లింపులు, వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. 2023లో టీడీపీ గెలిచిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశాయన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఏ విధంగా అయితే కృషి చేశారో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రెట్టింపు స్థాయిలో కృషి చేసి రాజశేఖరానికి విజయం చేకూర్చాలని కోరారు.

అసెంబ్లీ ఎన్నికలకు, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంటుందని, ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్‌ పేపర్లో పార్టీ సింబల్‌ ఉండదని.. క్రమ సంఖ్యలో నెంబర్లు ఉండి పేర్లు మాత్రమే ఉంటాయని… కూటమి ఎమ్మెల్సీ అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖరం పేరు ఎదురుగా ఉన్న గడిలో 1వ నెంబర్‌ వేసి ఆయనకు అఖండ విజయం చేకూర్చాలని ఓటర్లను కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

election campaign

You cannot copy content of this page