WhatsApp Image 2024 01 07 at 10.26.56 PM
చివరి శ్వాస వరకు విజయవాడకు కాపు కాసుకుంటూ పనిచేస్తా: ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని)
Trinethram News : 7th Jan 2024 : విజయవాడ
మైలవరం నియోజకవర్గం, రెడ్డిగూడెం మండలం, జి కొండూరు మండల పరిధిలోని 19 గ్రామాల త్రాగునీటి ఎద్దడి నివారణలో భాగంగా 19 వాటర్ ట్యాంకర్లను గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఈరోజు కేశినేని భవన్ వద్ద అందజేసిన ఎంపీ కేశినేని నాని..
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ…..
ప్రజాప్రతినిధిగా పని చేసుకుంటూ వెళ్లడమే నా లక్ష్యం.
నా చివరిశ్వాస వరకు విజయవాడకు కాపు కాసుకుంటూ పనిచేస్తా
నాకు ప్రోటోకాల్ ఇచ్చామని చెప్పుకోవడానికి సీటు, బ్యానర్లు వేసుంటారు
విజయవాడ పార్లమెంట్ పరిధిలోని 288 గ్రామాలకు వాటర్ ట్యాంకర్లను అందజేయబోతున్నాం.
దానిలో భాగంగా ఇప్పటికీ సుమారు 150 వాటర్ ట్యాంకర్లను అందజేశాం ఇంకో 100 వాటర్ ట్యాంకర్లను నెలాఖరులోపు అందజేస్తాం అన్నారు
ఈ కార్యక్రమంలో RWS అధికారులు పలు గ్రామ సర్పంచులు, కేశినేని నాని అభిమానులు పాల్గొన్నారు.
