WhatsApp Image 2025 01 29 at 21.07.19
Trinethram News : సలీం గా గుర్తించిన కుటుంబ సభ్యులు బిక్కవోలు, వ్యక్తిగత సమస్యలు నేపథ్యం లో ఈ నెల 9 న సామర్లకోట కెనాల్ లో దూకి గల్లంతైన జర్నలిస్ట్ షేక్ సలీం మృతదేహం ఎట్టకేలకు లభించింది. అదే కెనాల్ లో సంఘటనకు సుమారు కిలో మీటర్ దూరం లో సలీం మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఘటన జరిగి సుమారు 20 రోజులు కావడంతో మృతదేహం బాగా గుర్తు పట్టలేని విధంగా మారిపోయింది. అయితే వేసుకున్న దుస్తులు, ఇతర ఆనవాళ్ళతో అది సలీం మృతదేహం గా కుటుంబ సభ్యులు గుర్తించారు.
చాల రోజులుగా మృతదేహం లభించకపోవడంతో సలీం చనిపోలేదని, ఎక్కడికో వెళ్లి పోయి క్షేమంగానే వుండి వుంటాడని తొలుత మిత్రులంతా భావించి ఊపిరి పిల్చుకున్నారు. గుర్రపు డెక్కలో కూరుకుపోవడం వల్ల ఇన్ని రోజులు మృత దేహాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు. జర్నలిస్ట్ నిఘా దిన పత్రిక ఎడిటర్ గా సలీం అందరికి సుపరిచితుడు.బిక్కవోలు వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎమ్ అశోక్.సభ్యులు సలీం ఆత్మ కు శాంతి చేకూరాలని వారు నివాళులు తెలియచేశారు. వారు కుటుంబ సభ్యులు కు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
