జూన్ 27, 2026

IMG 20250128 WA0014

TRINETHRAM NEWS

గద్దర్ పోరాటం ముందు పద్మశ్రీ అవార్డు చాలా చిన్నది

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
జాతీయ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అవార్డు గ్రహీత కోళ్ళ యాదయ్య మాట్లాడుతూ బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోపీడిత ప్రజల విముక్తి కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప పోరాట యోధుడు గద్దర్..తెలంగాణ ఉద్యమంలో తన మాట పాట ఆటతో యావత్ తెలంగాణసమాజాన్ని సంఘటితం చేసిన యుద్ధనౌక గద్దర్.
ప్రజా యుద్ధనౌక గద్దర్ పై అవమానకర వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలి. లేకుంటే తెలంగాణ సమాజంమిమ్మల్ని క్షమించదు బండి సంజయ్ గారు తాను కేంద్రం మంత్రిని అనే విచక్షణ మరిచి గల్లి స్థాయి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు.తెలంగాణ భావజాలం,తెలంగాణ అస్తిత్వం, పేదల పక్షాన పోరాడిన పోరాటయోధుల పై బిజెపికి ఎంత ద్వేషముందో మీ మాటలను బట్టి అర్థమవుతుంది.నీ వ్యాఖ్యలను బట్టి చూస్తే భవిష్యత్తులో ఈ దేశంలోఆర్ఎస్ఎస్, బిజెపి భావజాలం ఉన్నవారికే ఏ ప్రతిభ పురస్కారాలు అయినా ఇస్తాం. ఎలాంటి అవినీతికిపాల్పడినా వాషింగ్ పౌడర్ నిర్మా సర్టిఫికెట్ ఇస్తాం అనే లాగా ఉన్నాయి.కనీస జ్ఞానం లేని నీలాంటి అజ్ఞానికి కరీంనగర్ బిడ్డలు ఓటు వేయడం, దరిద్రం కొద్దీ నీకు మంత్రి పదవి ఇవ్వడం తెలంగాణ ప్రజల కర్మ.
గద్దర్ గురించి మాట్లాడే స్థాయి అర్హత లేని బండి సంజయ్.బేషరతుగా గద్దర్ కి, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి .కోరారు మీ.కోళ్ళ యాదయ్య జాతీయ డాక్టర్ బీ ఆర్ అంబేత్కర్ అవార్డు గ్రహీత

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page