జూన్ 27, 2026

WhatsApp Image 2025 01 27 at 21.31.54

TRINETHRAM NEWS

అయిచి ప్రిఫెక్చర్ తో ద్వైపాక్షిక సంబంధాలకు రెడీ… ఐటి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

జపాన్ లోని అయిచి రాష్ట్రం (ప్రిఫెక్చర్) తో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలకు తెలంగాణా ఆహ్వానం పలుకుతోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.

సోమవారం నాడు తనతో భేటీ అయిన జపాన్ లోని అయిచి ప్రిఫెక్షర్ ప్రతినిధులతో ఆయన సచివాలయంలో మాట్లాడారు. రెండు రాష్ట్రాలు వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో పరస్పరం సహరించుకోవాలని శ్రీధర్ బాబు సూచించారు. అయిచీ రాష్ట్రం టొయోటా కార్ల పరిశ్రమతో పాటు, ఏరోస్పేస్, ఆటోమొబైల్, రోబోటిక్స్, యంత్ర పరికరాల తయారీలో అగ్రగామిగా ఉంది. ఇటీవలే ఆ రాష్ట్రం ‘స్టేషన్ ఏఐ’ పేరుతో జపాన్ లోనే అతిపెద్ద అంకుర సంస్థల ఇన్ క్యుబేషన్ కేంద్రాన్ని ప్రారంభించింది. తెలంగాణా రాష్ట్రంలోని టీ హబ్ కూడా అంకుర సంస్థల ప్రోత్సాహంలో దేశంలో ప్రముఖంగా నిలుస్తోందని శ్రీధర్ బాబు తెలిపారు.

అయిచీ అసెంబ్లీ సభ్యుడు, ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన హిరోహిటో కొండో 2026 లో తమ రాష్ట్రంలో జరిగే 20 వ ఏషియా క్రీడలకు మంత్రి శ్రీధర్ బాబును ఆహ్వానించారు. అక్కడి గిబ్లి యానిమేషన్ పార్క్ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆహ్వానిస్తోందని కొండో మంత్రి దృష్టికి తెచ్చారు. ద్వైపాక్షిక సంబంధాలతో ఇరు ప్రాంతాలు ప్రయోజనం పొందేలా సహకారం కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. సమావేశంలో ఇండోబాక్స్ ఇండియా ఎండీ డైసుకే టాంజీ, షిన్యా సుకాడా, నాచారంలోని సపల ఆర్గానిక్స్ సిఇఓ పైడి ఎల్లారెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డా. వి. నర్సింహాచార్యులు, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ డా. జి. చంద్రశేఖర్ రెడ్డి, ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, టిజిఐఐసి ఎండీ డా. విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page