జూన్ 27, 2026

WhatsApp Image 2025 01 27 at 21.49.37

TRINETHRAM NEWS

కాళేశ్వరం జోన్ క్రీడాకారులకు ట్రాక్ సూట్స్ పంపిణి చేసిన సీపీ

త్రినేత్రం న్యూస్ రామగుండం ప్రతినిధి

కరీంనగర్ లో జరిగే తెలంగాణ రాష్ట్ర స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ పోటీలు కోసం కాళేశ్వరం జోన్ తరపున ప్రాతినిధ్యం వహించడం కోసం ఎంపికైన క్రీడాకారులకు రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజీ పోలీస్ అధికారులతో కలిసి ట్రాక్ సూట్స్ అందచేసారు.

ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ ఈ క్రీడల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారులు తప్పకుండ నేను మెడల్ సదిస్తాను అనే బలమైన నమ్మకం పట్టుదలతో పోటిలలో పాల్గొనాలి అని సూచించారు. కాలేశ్వరం జోన్ తరుపున రాష్ట్ర స్థాయిపోటీలలో పాల్గొని అక్కడ కూడా కాళేశ్వరం జోన్ కు అత్యధిక పతకాలు సాధించి మంచి పేరు తీసుకురావాలని కోరారు.

ఈ కార్యక్రమం లో పెద్దపల్లి డిసిపి చేతన ఐపిఎస్.అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏ ఆర్ ఏసీపీ లు ప్రతాప్, సుందర్ రావు, ఆర్ఐ లు దామోదర్, శ్రీనివాస్, మల్లేశం, సంపత్, కాళేశ్వరం జోన్ కి ఎంపికైన క్రీడాకారులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page