జూన్ 27, 2026

WhatsApp Image 2025 01 27 at 21.20.24

TRINETHRAM NEWS

అరకొర నిధులతో బస్కిరోడ్డు,అదనపు నిధులు మంజూరు చెయ్యాలి అని. “సిపిఎం ” డిమాండ్.

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ త్రినేత్రం జనవరి 28:

అరకు వేలి నుండి బస్కి 11 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణం కొరకు మంజూరు చేసిన మూడు కోట్ల 30 లక్షల రూపాయలు సరిపోవడం లేదు అదనపు నిధులు కోటి 70 లక్షలు వరకు మంజూరు చేసి పూర్తిస్థాయిలో రోడ్డు నిర్మాణం చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కిండంగి రామారావు డిమాండ్ చేయడం జరిగింది.
రోడ్డు నిర్మాణం కొరకు క్వాలిటీగా నిర్మించాలని కాంట్రాక్టు వారికి అడిగితే నిధులు సరిపోదు కాబట్టి రోడ్డు పూర్తిస్థాయిలో నిర్మాణం చేయలేమని అంటున్నారు.
ఈ విషయమై స్పందనకి ఫిర్యాదు చేసి నప్పటికీ ఫలితం ఈరోజు వరకు లేకపోవడంతో పంచాయతీ ప్రజలు రోడ్డు సక్రమంగా నిర్మాణం జరగదేమో అని ఆందోళన చెందుతున్నారు గత 17 సంవత్సరాలు కిందట వేసిన తారు రోడ్డు ఎటువంటి రిపేరు చేయకుండా ఈరోజు వరకు ఉండడంతో పూర్తిగా కల్వర్టు బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి కల్వర్టు బ్రిడ్జిలు సిసి నిర్మాణం చేయాలంటే అదనపు నిధులు సుమారు కోటి 70 లక్షలు మంజూరు చేయవలసిన అవసరం ఉందని కాంటాక్ట్ వారు తెలియజేసారు.
కాబట్టి రోడ్డు పూర్తి చేయడానికి కావలసిన నిధులు తక్షణమే మంజూరు చేయాలని నిరసన చేయడం జరుగుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణం కొరకు అదనపు నిధులు కోటి 70 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సద్దు, రాందాస్, వెంకట్, గురుమూర్తి, గురుస్వామి, విశ్వనాథ్, కమల, జానకి, సుమని, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page