జూన్ 27, 2026

WhatsApp Image 2025 01 27 at 18.23.59

TRINETHRAM NEWS

ఎన్టీపీసీ పట్టణ బంద్ ను విజయవంతం చేయండీ

ఎన్టీపీసీ యాజమాన్యం భూనిర్వసీతులు జీవితాలను చికటిమయం చేసింది

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఎన్టీపీసీ విస్తరణకు భూములను త్యాగం చేసిన భూ నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతనే ఎన్టీపీసీ యాజమాన్యం అభిప్రాయ సేకరణ చేపట్టాలని 28న న్టీపీసీ బందు ప్రజలందరికీ విజయవంతం చేయాలని

రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ ప్రజలను కోరారు.భూ నిర్వసీతులు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే అభిప్రాయ సేజరణ చేపట్టాలని డిమాండ్ చేసారు. ఎన్టీపీసీ లో ముఖ్య భూమిక పోషించిన కాంట్రాక్టు కార్మికులను ఎన్టీపీసీ యాజమాన్యం విస్మరించిందని కార్మికుల పిల్లలకు మేరుగైనా విద్య వైద్యం సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రామ గుండంలోని ఎన్టీ పీసీ విద్యుత్ ప్రాజెక్ట్ దేశానికి వెలుగులు అంది స్తున్నా.. నిర్వాసి తుల కుటుంబాలు చీకల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, తెలంగాణ స్టేజ్-2లో చేపట్టే 2,400 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుతో ఈ ప్రాంతం కాలుష్యంగా మారుతుందన్నారు. విలువైన భూములు అందిస్తున్న నిర్వాసితులకు ప్రాజెక్టులో ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

ప్రభావిత, పునరావాస ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించి, మౌలిక వస తులు కల్పించాలన్నారు. కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు కార్పొ రేట్ స్థాయిలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించి ఉచిత వైద్యం అందించాలని డిమాం డ్ చేశారు. యాష్పాండ్ నిర్మాణం కోసం 600 ఎకరాలను సేకరించేందుకు ఈనెల 28న ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతోందని, అంతకుముందుగానే నిర్వాసితులకు కల్పించే ప్రయోజనాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కుందనపల్లి, మల్యాలపల్లె, అక్బర్నగర్, బద్రిపల్లె, మొఘల్పహాడ్, మాతంగి కాలనీవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. లేకుంటే ప్రజాభిప్రాయ సేకరణను బీఆర్ఎ స్ ఆధ్వర్యంలో అడ్డుకుం టామని హెచ్చరించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page