Old Pension System : పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలి

TRINETHRAM NEWS

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలి

పి ఆర్ టి యు టి ఎస్ రామగుండం అధ్యక్షులు ప్రేమ్ కుమార్

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

కేంద్ర ఆర్థిక శాఖ గెజిట్ నెంబర్ 27 తేది 25-01-2025 ద్వారా ఇచ్చిన ఏకికృత పెన్షన్ స్కీమ్ ను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నామని పి ఆర్ టి యు టి ఎస్ రామగుండం మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాండ్ర ప్రేమ్ కుమార్, పర్లపెల్లి రఘుబాబులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా వారు రామగుండం తహసీల్దార్ కార్యాలయంలో ఏకికృత పెన్షన్ పతకాన్ని వ్యతిరేకిస్తూ వినతి పత్రాన్ని సమర్పించారు.ఉద్యోగ విరమణ అనంతరం జీవిత భద్రతలేని కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని రద్దు చేయాలని సంవత్సరాలుగా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉద్యమాలు చేస్తుంటే కంటితుడుపు చర్యగా ఏకికృత పెన్షన్ పథకాన్ని తీసుకురావడం సరైన విధానం కాదన్నారు.సి పి ఎస్ విధానం వలన ఉద్యోగులకు జరుగుతున్న నష్టాలను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్, చత్తిష్ గడ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించారని వారు పేర్కొన్నారు. తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టో లో పొందుపర్చినట్టుగా సి పి ఎస్ విధానాన్ని రద్దు చేసి 1980 రివైస్డ్ పెన్షన్ ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కుంట రామన్న, మండల కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top