ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ ను తొలగించలేరు: ఎమ్మెల్యే హరీష్ రావు

TRINETHRAM NEWS

ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ ను తొలగించలేరు: ఎమ్మెల్యే హరీష్ రావు

Trinethram News : పెద్దపల్లి జిల్లా:జనవరి 06
బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు త్వరలోనే జిల్లాలలో పర్యటిస్తారని ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీష్‌రావు వెల్లడించారు.

శనివారం తెలంగాణ భవన్‌లో పెద్దపల్లి పార్ల మెంటు నియోజక వర్గ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లా డారు. కేసీఆర్ త్వరగా కోలుకుంటున్నారని, సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారని పేర్కొన్నారు.

ఫిబ్రవరి లో తెలంగాణ భవన్‌కు వచ్చి ప్రతి రోజూ కార్యకర్తలను కలుస్తారని వెల్లడించారు.ప్రజలగుండెల్లో ఉన్న కేసీఆర్‌ను తొలగించలేరని అన్నారు.

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కేసీఆర్‌ కిట్లపై కేసీఆర్‌ గుర్తును తొలగించినా తెలంగాణ ప్రజల గుండెల నుంచి తొలగించలేరని అన్నారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను రద్దులు చేస్తూ వాయిదాలు వేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్‌ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యల పై ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ కార్యకర్తల పై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఎమ్మెల్యేలంతా బస్సు కట్టుకుని బాధితుల వద్దకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీ స్తామని హెచ్చరించారు.

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమం లో రాజీనామాలు చేశాం తప్ప రాజీ పడలేద’ని అన్నారు. ప్రభుత్వ తీరును చూస్తుంటే ఏడాదిలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోందని తెలిపారు.

ప్రభుత్వానికి అందజేసిన ధాన్యం డబ్బులను, రైతు బంధు పథకం డబ్బులను ప్రభుత్వం వేయలేదని పేర్కొన్నారు. పదేండ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినా ప్రతిపక్షాల దుష్ప్రచారం వల్ల ఓడిపో యామని అన్నారు.

ఓటమి స్పీడ్‌ బ్రేకర్‌ లాంటిది.. అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
మొన్నటి ఎన్నికలు కేవలం స్పీడ్‌ బ్రేకర్‌ లాంటిదని అన్నారు. తొలిసారి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం, సత్తా ఏమిటో చూపిద్దామని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.

పెద్దపల్లి పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకు నేందుకు కార్యకర్తలు సమష్టిగా పని చేయాలని, ముందు ముందు మంచి రోజులు వస్తాయని అన్నారు ..

You cannot copy content of this page

Scroll to Top