TRINETHRAM NEWS

రాహుల్ గాంధీ పీఏ నంటూ మోసాలు.. అరెస్ట్ చేసిన మొయినాబాద్ పోలీసులు

Trinethram News : మొయినాబాద్ : పలువురు వీవీఐపీలు పేరుతో మోసాలకు పాల్పడ్డ సయ్యద్ బురానుద్దీన్

రాహుల్ గాంధీ పీఏ నంటూ ఛత్తీస్‌ఘడ్ మోసాలు

ఏకంగా ఛత్తీస్‌ఘడ్ సీఎం కార్యాలయం సిబ్బందికే కుచ్చుటోపి

మైనింగ్ ఇప్పిస్తామంటూ కోట్ల రూపాయల మేర మోసం

ఛత్తీస్‌గఢ్ క్యాడర్‌కి చెందిన ఓ ఐఏఎస్ అధికారిని మోసం చేసిన ఘనుడు

పీఎం కార్యాలయంలో పనిచేస్తున్నానంటూ ఐఏఎస్‌ను నమ్మించిన మోసగాడు

ఐఏఎస్ పై అప్పటికే కొనసాగుతున్న సీబీఐ ఎంక్వయిరీని రద్దు చేపిస్తానంటూ.. కోటిన్నర రూపాయలు తీసుకొని పారిపోయిన జాదుగాడు

హైదరాబాదులో ఓ బిజినెస్‌మెన్‌కు ఈడీ అధికారులు నోటీసులో జారీ చేసిన విషయం తెలిసి ఆ వ్యాపారిని మోసం చేసిన వ్యక్తి

నకిలీ ఈడీ కార్యాలయాన్నే సృష్టించిన కేటుగాడు

అదే కార్యాలయానికి వ్యాపారిని పిలిపించి కోట్ల రూపాయలు వసూలు

మొయినాబాద్‌లో రెండేళ్ల క్రితం ఓ భూ కబ్జా చేసే ప్రయత్నంలో కేసు నమోదు

ఈ కేసు దర్యాప్తులో సయ్యద్ బురానుద్దీన్‌ను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు

విచారణలో వెలుగులోకి వచ్చిన సయ్యద్ బురానుద్దీన్ ఘరానా మోసాలు

ఇతని పై 12 పోలీస్ స్టేషన్లో పలు కేసులు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App