TRINETHRAM NEWS

మంథని నాయి బ్రాహ్మణ బిడ్డకు పదవి పట్ల హర్షం ఆర్టిఏ మెంబెర్ గా మంథని సురేష్

త్రినేత్రం న్యూస్ , ముత్తారం ఆర్ సి :

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన నాయి బ్రాహ్మణ ముద్దుబిడ్డ మంథని సురేష్ పెద్దపల్లి జిల్లా ఆర్టిఏ మెంబర్ గా నియమితులైన సందర్భంగా ముత్తారం మండల నాయి బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. మంథనిలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా విద్యార్థి దశ నుండి మంత్రి శ్రీధర్ బాబు అనుచరుడిగా నాయి బ్రాహ్మణ కులవృత్తి చేసుకుంటూ రాజకీయాల్లో రాణిస్తున్న మంథని సురేష్ పనితనాన్ని గుర్తించి పెద్దపల్లి జిల్లా రీజినల్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ సభ్యునిగా నియమించడం పట్ల ముత్తారం మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్ష కార్యదర్శులు శ్రీమర్తి సంపత్ అధ్యక్షులు నాగవల్లి రాజయ్య,మౌనూరి రవి, కొలిపాక కుమార్,మందల ధర్మయ్య,మంథని లింగమూర్తి, మంథని సతీష్, నాగవెల్లి శివ శంకర్, శ్రీనివాస్, శ్రీమర్తి శ్రీనివాస్, మిడిదొడ్డి వెంకటేష్,వీరస్వామి, శ్రీనాథ్,ప్రవీణ్,హరి లు హర్షం వ్యక్తం చేశారు.నాయి బ్రాహ్మణ బిడ్డకు పదవిని అందించిన మంత్రి శ్రీధర్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App