ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్ ..
Trinethram News : ఆంధ్రప్రదేశ్ : శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుళ్ల సముద్రం సమీపంలో ఆగి ఉన్న లారీని టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 10 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు గుడిబండ, అమరాపురం వాసులుగా గుర్తించారు. తిరుమల దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన సమయంలో టెంపోలో 14 మంది ప్రయాణికులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App