జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 02 at 4.02.24 PM

TRINETHRAM NEWS

జగతగిరిగుట్ట డివిజన్ రింగ్ బస్తీలో రోడ్డును బాగుచేయ్యాలి.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

జగతగిరిగుట్ట డివిజన్లోని రింగ్ బస్తీలో ప్రభుత్వ పాఠశాలకు ఎదురుగా ఉన్న రోడ్డును 3 నెలల క్రితం తవ్వి అలాగే వదిలివెయ్యడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే రోడ్డును వేయ్యాలని కోరుతూ నేడు సీపీఐ మక్డుం నగర్ శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు హడావుడిగా కొత్త రోడ్లు వేస్తామని చెప్పి ఉన్న రోడ్లను తవ్వి నెలలు గడుస్తున్నా వేయకుండా ఉండటం వల్ల స్థానికులు పాదచారులు,వాహనాలు నడిపే వారు గుంతల వల్ల దెబ్బలు కూడా తగిలాయని, అధికారులు రేపు మపు అంటూ కాలం వెళ్ళదిస్తున్నారే కానీ రోడ్డు వెయ్యడం లేదని అన్నారు.ఇప్పటికైనా వేయ్యాలని లేకపోతే స్థానిక ప్రజలను కూడగట్టి మునిసిపల్ కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహిస్తామని అధికారులను హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి అధ్యక్షుడు ప్రవీణ్,ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా మునిసిపల్ అధ్యక్షుడు రాములు, కోశాధికారి సదానంద,శాఖ కార్యదర్శి సుధాకర్,స్థానికులు కరణ్ సింగ్,చంద్ర,ఖాదర్, మహేందర్, మున్నీ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page