జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 01 at 5.20.40 PM

TRINETHRAM NEWS

మాణిక్యమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆర్థిక వితరణ

సహాయం చేయడానికి మంచి మనసు ఉండాలి: బీపీ నాయక్

బోనకల్: మండల కేంద్రంలోని మాణిక్యమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు బీపీ నాయక్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేశారు. ఈ నూతన సంవత్సరంలో కూడా సవ్వాళ్లను ఎదుర్కొంటూ ధైర్యంగా ప్రతి ఒక్కరు విజయం సాధించాలని అభిలాషించారు. ట్రస్ట్ అధినేత అంతోటి శివ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి గుర్తింపు పొందారని ఆలయ నిర్మాణం లో ఉన్న చర్చి పనులకు ఆర్థిక వితరణ చేస్తూ మరోసారి పెద్దమనసు చాటుకున్నారని, రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చర్చ్ నిర్వాహకులు, మహిళలు, ట్రస్ట్ ప్రతినిధులు తదితర నాయకులు పాల్గొన్నారు.

You cannot copy content of this page