జూన్ 27, 2026

IMG 20241129 WA0053

TRINETHRAM NEWS

ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ అదనపు కలెక్టర్ సుధీర్ శుక్రవారం సిడిఎంఎ ప్రధాన కార్యాలయం నుండి పురపాలక పరిపాలన కమిషనర్ అండ్ డైరెక్టర్ టీ.కే. శ్రీదేవి ప్రజాపాలన విజయోత్సవాలపై అదనపు కలెక్టర్లు, మెప్మా పీడీలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా పాలన విజయోత్సవాలపై ఆమె పలు సూచనలు చేశారు. అధికారులను ఉద్దేశించి అదనపు కలెక్టర్ సుదీర్ మాట్లాడుతూ. ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా డిసెంబర్ 3వ తేదీన జిల్లా కేంద్రంలో 2కే రన్ నిర్వహించాలన్నారు. మున్సిపాలిటీ పరిధిల్లో సుందరీకరణ కార్యక్రమాలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. అదేవిధంగా విద్యుత్తు దీపాలతో ప్రధాన,కూడళ్ళు,కార్యాలయాలను అలంకరించాలని ఆయన తెలిపారు. మహిళా సంఘాల గ్రూపులకు రుణాల చెక్కులను అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో మెప్మా పిడి రవికుమార్, మున్సిపల్ కమిషనర్లు జాకీర్ అహ్మద్, విక్రమ్ సింహరెడ్డి, వెంకటయ్య, బలరాం నాయక్, టౌన్ మిషన్ కోఆర్డినేటర్లు వెంకటేష్, రాజేంద్రప్రసాద్, భాగ్యలక్ష్మి లు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page