జూలై 16, 2026

WhatsApp Image 2024 11 28 at 20.32.37

TRINETHRAM NEWS

జాతీయ కుష్టి వ్యాధి నిర్మూలన, లెప్రసీ పై అవగాహన, నోడల్ సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చిన డి.ఎం.అండ్ హెచ్.ఓ. డాక్టర్ సాంబశివరావు

వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
28నవంబర్ 2024

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వరంగల్ డాక్టర్.బి. సాంబశివరావు అధ్యక్షతన డి ఎం అండ్ హెచ్ ఓ కార్యాలయం మీటింగ్ హాల్లో లెప్రసీ అవగాహన, కేసుల నిర్ధారణ పై జిల్లాలోని నోడల్ సూపర్వైజర్లకు శిక్షణ ఇవ్వడం జరిగినది. జాతీయ కుష్టి వ్యాధి నిర్మూలన కార్యక్రమం వరంగల్ జిల్లాలో రెండు డిసెంబర్ నుండి 15 డిసెంబర్ వరకు ఉదయము 6 గంటల నుండి 9 గంటల వరకు ఇంటింటి సర్వే ఆశా కార్యకర్తలు ,ఆరోగ్య కార్యకర్తలు ,ఆరోగ్య సిబ్బంది ద్వారా చేయడం జరుగుతుందని తెలిపినారు .ప్రజలు స్వచ్ఛందంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో సహకరించి ఒంటిపైన పారిపోయిన , రాగి రంగులో, స్పర్శ జ్ఞానం లేని మచ్చలు ఉంటే వెంటనే వైద్య సిబ్బందికి సూపించాలని, చెవి వెనక, ముంజేతులు కాళ్లు ఉపరితల నరుములు, చెవివేలుపల నూనె రాసినట్లు బొడిపెలు ఉన్నచో, పరీక్షలు చేయించుకొని డాక్టర్ గారి సలహా మేరకు తగిన చికిత్సలు తీసుకోవాలని కోరినారు. కుష్టి వ్యాధి పెద్ద రోగం కాదని మనం చేసిన పాపాల వల్ల వచ్చిందని గాని, శాపం వల్ల వచ్చిందని అని భావించవద్దు, కుష్టి వ్యాధి మైకోబాక్టీరియం లెఫ్ట్రి అనే బ్యాక్టీరియా వలన వస్తుందని ఇది అన్ని రోగములవలనే నయమవుతుందని తెలిపినారు. కుష్టి వ్యాధితో బాధపడుతూ అంగవైకల్యం కలిగిన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలతో సరిచేసి నయం చేయవచ్చునని, ప్రజలంతా సహకరించి తమ వ్యాధులకు తగిన చికిత్సలు చేయించుకోవాలని కోరినారు . శిక్షణానంతరం సర్వేకు సంబంధించిన ఐ.ఇ.సి. మెటీరియల్స్ పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. బి.సాంబశివరావు, డిప్యూటీ డి.ఎం.అండ్ హెచ్.ఓ.డాక్టర్ మోహన్ సింగ్, ఫిజియోథెరపిస్టు డాక్టర్ నరసింహారెడ్డి, డి.పి.ఎం.ఓ లు వెంకన్న ,అనుపమ రెడ్డి, డిప్యూటీ డెమో అనిల్ కుమార్ , జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నోడల్ ఆఫీసర్స్ మోహన్ రావు ,వైకుంఠం , సుజాత, మోహన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page