సి. పి. ఎం పార్టీ జిల్లా ప్రధమ మహాసభ ను జయప్రదం చేయండి. – పి. అప్పలనరస

TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్ (అల్లూరిజిల్లా ) జిల్లాఇంచార్జ్ : భారత కమ్యునిస్టు పార్టీ (మార్క్సిస్టు)
అల్లూరి సీతారామరాజు జిల్లా కమిటీ.

సి .పి.ఎం పార్టీ జిల్లా ప్రథమ మహాసభ ను జయప్రదం చేయండి.

డిసెంబర్ 4 న నిర్వహించే బహిరంగ సభ కు తరలిరండి .

పాడేరు జిల్లా ప్రథమ మహాసభ ను జయప్రదం చేయాలని, పార్టీ జిల్లా కార్యదర్శి పి.అప్పల నరస పిలుపు నిచ్చారు.

పాడేరు జిల్లా పార్టీ కార్యాలయంలో పాడేరు మండల పార్టీ కమిటీ కార్యదర్శి ఎల్. సుందరావు,పార్టీ సీనియర్ నాయకుడు పి. లక్కు, జి. మాడుగుల మండల కార్యదర్శి ఎస్.ధర్మాన పడల్ తో కలిసి పి.అప్పల నరస బహిరంగ సభ పోస్టర్ ను విడుదల చేసారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి, పి.అప్పల నరస మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా కమిటీ ప్రథమ మహాసభ డిసెంబరు 4 నుండి 5 వరకు పాడేరు జిల్లా కేంద్రం లో జయప్రదం చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 5వందలమంది ముఖ్యమైన నాయకులకు ప్రతినిధులుగా వస్తున్నారని తెలిపారు. జిల్లా మహాసభలో గత మూడేళ్ళుగా నిర్వహించిన ప్రజా ఉద్యమాలు, అనుభవాలు, గుణపాఠాలు సమీక్ష చేస్తామని,భవిష్యత్ కార్యాచరణ రూపొందించు కొని ప్రజా పోరాటం ఉదృతం చేస్తామని అన్నారు. జి ఓ నెంబర్ 3 రిజర్వేషన్ సాధన, జిల్లా సమగ్రాభివృద్ధికై ప్రభుత్వం పై ఒత్తిడి పెంచుతామని తెలిపారు. రైతులు గిట్టుబాటు ధరలు ,కనీస వేతనం 26 వెలు రూపాయలు కార్మికుల ఇవ్వాలని, ,పి.వి.టి.జి తెగల కు ఇల్లు నిర్మాణానికి 5 లక్షల రూపాయలకు పెంచాలని, ఆదివాసీ మాతృ భాష విద్య వాలంటరీ లను రెగ్యులర్ చేయాలని, తదితర సమస్యలపై తీర్మానం చేసి భవిషత్ ఉద్యమ కార్యాచరణ కు ప్రణాళిక రూపొందించాలని జిల్లా మహాసభ నిర్వహణ జరుగుతుంది. డిసెంబరు 4 న పాడేరు లో ర్యాలీ,బహిరంగ సభ నిర్వహిస్తామని, ముఖ్యఅతిథిగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాస రావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె.లోక నాదం పాల్గొంటారు. బహిరంగ సభకు ప్రజలు తరలిరావాలని కోరారు. తలా ర్ సింగ్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి సభ నిర్వహిమని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం
నూతన గా ఏర్పడిన ప్రభుత్వం పరిపాలన గత ప్రభుత్వానికి భిన్నంగా లేదని ఇసుక ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటిందని, విద్యుత్ చార్జీలు భారం పెంచిందని అన్నారు.నూతన జిల్లా ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యాలయం నిర్మాణం పనులకు శంకుస్థాపన కార్యక్రమం కూడా చేపట్టలేదని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కి నిధులు కేటాయించాలని, పి. అప్పలనరస ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top