జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 26 at 1.41.42 PM

TRINETHRAM NEWS

మధ్యాహ్న భోజనాలను తనిఖీ చేసిన ఎంఈవో-2
Trinethram News : ప్రకాశం జిల్లా కంభం.. స్థానిక ఆదిఆంధ్ర ప్రాథమిక పాఠశాలలో డొక్కా.సీతమ్మ మధ్యాహ్న బడి భోజనాలను మండల విద్యాశాఖాధికారి-2 టి.శ్రీనివాసులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బోజనాల రుచి, నాణ్యతలను పరిశీలించి, వంట నిర్వాహకులకు సూచనలు చేశారు. రికార్డులను పరిశీలించి, బియ్యం,చిక్కీ,గుడ్లు వాస్తవ నిల్వలను, రికార్డులలో నమోదైన వివరాలతో సరిపోల్చుకున్నారు. మధ్యాహ్న భోజనాల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రతా అంశాలపై వంట నిర్వాహకులు, ఉపాధ్యాయ బృందంతో చర్చించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page