చరిత్ర సృష్టించిన కోహ్లీ.. సచిన్ రికార్డుకు పాతర
Trinethram News : టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి పాత రికార్డులను బద్దలు కొట్టడం, కొత్త రికార్డులు సృష్టించడం అలవాటుగా మారింది. అతడు సరదా సరదాకే ఎన్నో బ్రేక్ చేసేశాడు. అలాంటిది సీరియస్ మోడ్‌లో ఉంటే ఇంక రికార్డులకు మూడినట్లే అని చెప్పొచ్చు. ఇప్పుడు అదే జరుగుతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ తన క్లాస్ ఏంటో చూపిస్తున్నాడు. సాలిడ్ డిఫెన్స్‌తో పాటు అవసరమైన సమయంలో బ్యాట్‌ను మంత్రదండంలా తిప్పుతూ మ్యాజికల్ షాట్స్ ఆడుతున్నాడు. ఇప్పటికే హాఫ్ సెంచరీ దాటేసిన కింగ్.. సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో అతడో రికార్డును క్రియేట్ చేశాడు.
బ్రేక్ చేయడం ఖాయం
పెర్త్ టెస్ట్‌లో కొట్టిన తాజా సెంచరీతో బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ సరసన నిలిచాడు కోహ్లీ. కంగారూ గడ్డ మీద అత్యధిక అర్ధ శతకాలు బాదిన ఆసియా బ్యాటర్ల లిస్ట్‌లో విరాట్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ జాబితాలో సచిన్ (13 హాఫ్ సెంచరీలు) టాప్‌లో ఉన్నాడు. తాజా హాఫ్ సెంచరీ ఆస్ట్రేలియా గడ్డ మీద విరాట్‌కు 11వది కావడం విశేషం. ఇదే లిస్టులో రెండో స్థానంలో ఉన్న పాక్ దిగ్గజం జహీర్ అబ్బాస్ (11 అర్ధ శతకాలు)ను దాటేసి రెండో స్థానంలోకి వచ్చేశాడు కోహ్లీ. సచిన్ రికార్డుకు ఎసరు పెడుతున్న స్టార్ బ్యాటర్.. ఈ బీజీటీలో దాన్ని బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
దాటడం పక్కా
కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి రావడంతో హాఫ్ సెంచరీల సచిన్ రికార్డును దాటేయడం పక్కాగా కనిపిస్తోంది. ఇది చూసిన నెటిజన్స్.. మాస్టర్ బ్లాస్టర్ రికార్డుకు విరాట్ పాతర వేయడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, పెర్త్ టెస్ట్‌లో టీమిండియా ప్రస్తుతం 5 వికెట్లకు 406 పరుగులతో ఉంది. కోహ్లీ (66 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (26 నాటౌట్) క్రీజులో ఉన్నారు. భారత జట్టు ఆధిక్యం 452 పరుగులకు చేరుకుంది. నాలుగో రోజు మార్నింగ్ సెషన్ పూర్తయ్యే వరకు టీమిండియా బ్యాటింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లీడ్ 500 మార్క్ దాటితే డిక్లేర్ చేయొచ్చు. కోహ్లీ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. కాబట్టి డిక్లరేషన్ ఎప్పుడు ఉంటుందో చూడాలి..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App