BCCI : ఐపీఎల్ షెడ్యూల్ అనౌన్స్.. మూడు సీజన్ల డేట్స్ ప్రకటించిన బీసీసీఐ

TRINETHRAM NEWS

ఐపీఎల్ షెడ్యూల్ అనౌన్స్.. మూడు సీజన్ల డేట్స్ ప్రకటించిన బీసీసీఐ

ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే మూడు సీజన్లకు సంబంధించి షెడ్యూల్‌ను శుక్రవారం అనౌన్స్ చేసింది. ప్రారంభ మ్యాచ్‌లు, ఫైనల్ మ్యాచ్‌ల డేట్స్ ప్రకటించింది.ఐపీఎల్‌కు వస్తున్న ఆదరణ మరింత పెంచడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్‌కు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడనుంది. ఫ్రాంచైజీలు, ప్లేయర్లు తమ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడానికి వీలు కల్పించినట్లయింది. ఐపీఎల్-2025 సీజన్‌లో మ్యాచ్‌ల సంఖ్యలో ఎలాంటి మార్పులు చేయలేదు. మొత్తం 74 ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. గత మూడు సీజన్లలో వినియోగించిన ఫార్మాట్‌నే ఈ సారి ఇంప్లిమెంట్ చేయనున్నట్లు క్రికెట్ బోర్డు తెలిపింది.

మూడు సీజన్ల షెడ్యూల్ ఇలా..

ఐపీఎల్-2025 మార్చి 14 న ప్రారంభం మే 25న ముగింపు

ఐపీఎల్ – 2026 మార్చి 15న ప్రారంభం, మే 31న ముగింపు

ఐపీఎల్ – 2027 మార్చి 14న ప్రారంభం మే 30న ముగింపు

18వ ఐపీఎల్ ఎడిషన్ మరిన్ని డిటైల్స్..

వచ్చే ఏడాది 18వ ఐపీఎల్ ఎడిషన్ మార్చి 14న ప్రారంభం

డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం, నైట్ మ్యాచ్‌లు 7.30కు ప్రారంభం

మ్యాచ్‌ బ్రాడ్‌క్యాస్టింగ్ హక్కులను స్టార్ స్పోర్ట్స్ సొంతం చేసుకుంది. జియో, స్టార్ సంస్థలు విలీనం కావడంతో ఈ రెండు కంపెనీల చానెల్స్‌లో లైవ్ మ్యాచ్‌లు ప్రసారం కానున్నాయి.

ఐపీఎల్ 2025 మ్యాచ్‌లను జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top