MEO-2 inspected school : ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ-2

TRINETHRAM NEWS

ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ-2… ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం.
Trinethram News : కంభం: మండలంలోని ఎల్కోట అంగన్వాడీ కేంద్రాన్ని మరియు ప్రాథమిక పాఠశాలను బుధవారం ఎంఈఓ శర్వాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల భాషా నైపుణ్యాలు,గణిత సామర్ధ్యాలను, పాఠశాల వసతులు,సౌకర్యాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, బోధనోపకరణాలను వినియోగిస్తూ బోధించడం ద్వారా విద్యార్థులలో ఆసక్తిని, గ్రాహక శక్తిని పెంపొందించవచ్చని తెలిపారు. అనంతరం మధ్యాహ్న భోజనాలను రుచి చూసి నిర్వాహకులకు సూచనలు చేశారు, డొక్కా.సీతమ్మ మధ్యాహ్న బడి భోజనాల రుచి, నాణ్యతలలో రాజీపడవద్దని సూచించారు. అంగన్వాడి కేంద్రంలోని రికార్డులను విద్యార్థుల హాజరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ పద్మావతి దేవి, ప్రధానోపాధ్యాయిని జి.అభిగైల్,అంగన్వాడీ కార్యకర్త లక్ష్మి పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top