దివిసీమ విషాదానికి నేటికి 47 ఏళ్లు
Trinethram News : Krishna : ఏపీలో దివిసీమ ఉప్పెనకు నేటితో సరిగ్గా 47 ఏళ్లు పూర్తయ్యాయి. 1977 నవంబర్ 19న అర్ధరాత్రి తాటి చెట్ల అంత ఎత్తున, తీరం నుంచి 8 కి.మీ వరకు అలలు పోటెత్తాయి. కృష్ణా జిల్లాలోని నాలి, సొర్లగొంది, సంగమేశ్వరం, గుల్లలమోద, హంసలదీవి వంటి ప్రాంతాలు తుడిచిపెట్టుకుపోయాయి. నిద్రలో ఉన్నవారు నిద్రలోనే జలసమాధి అయ్యారు. సుమారు 10వేల మందికిపైగా ప్రజలు, దాదాపు పశువులన్నీ మరణించాయి. ఈ ఘటన జరిగిన 3 రోజులకు బాహ్య ప్రపంచానికి తెలిసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App