WhatsApp Image 2024 11 15 at 11.25.37
భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు..
Trinethram News : అమరావతి..
కార్తిక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. సముద్ర, నదీతీరాల్లో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు..
అమరావతిలో కృష్ణమ్మ చెంత మహిళలు తెప్పలు వదిలారు. సూర్యలంక, చీరాల, చినగంజాం, పెదగంజాం సముద్ర తీరాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు స్నానమాచరించారు. దక్షిణ కాశీగా పేరొందిన శ్రీశైలంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ద్రాక్షారామం, కోటప్పకొండ, శ్రీకాళహస్తి, మహానంది తదితర పుణ్యక్షేత్రాల్లో భక్తుల రద్దీ నెలకొంది..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
