జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 30 at 5.40.58 PM

TRINETHRAM NEWS

PM Modi: జనవరి 22 కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది: అయోధ్య ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవంలో మోదీ

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని అయోధ్య (Ayodhya)లో మరికొద్ది రోజుల్లో రామమందిర ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగనుంది. ఆ మహత్కార్యం కోసం యావత్‌ ప్రపంచం ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) అన్నారు..

శనివారం అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధాని.. ఈ ఆధ్యాత్మిక నగరంలో నూతనంగా నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు..

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ”అయోధ్య విమానాశ్రయానికి.. త్రికాలదర్శి అయిన మహర్షి వాల్మీకి పేరు పెట్టడం జన్మధన్యంగా భావిస్తున్నా. రోజుకు 10 లక్షల మందికి సేవలు అందించేలా ఈ ఎయిర్‌పోర్టును నిర్మించాం. రద్దీ మేరకు రహదారులు విస్తరిస్తాం. అయోధ్యధామ్‌లో ఎక్కడ చూసినా రామనామం వినిపించాలి. ఇక్కడకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని వసతులతో టౌన్‌షిప్‌లు నిర్మిస్తున్నాం” అని వెల్లడించారు..

You cannot copy content of this page