జూలై 16, 2026

WhatsApp Image 2024 11 10 at 18.25.05

TRINETHRAM NEWS

మామూలు దోపిడి కాదు.. ఆధార్‌లో అక్షరం మారాలంటే రూ.5000 కట్టాల్సిందే..

ఆధార్ కార్డులో పొరపాటున ఒక్క అక్షరం దొర్లిన అడిగినంత సమర్పించాల్సిందే..

అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని ఆధార్ సెంటర్ నిర్వాహకులు బరితెగిస్తున్నారు.

అసలు ఏం జరిగిందంటే..

యువరాజు యాదవ్ అనే ఒక పదవ తరగతి విద్యార్థి తన ఇంటి పేరులో ఒక అక్షరం మార్చడానికి ఆధార్ సెంటర్‌కు వెళ్ళాడు. వెంటనే మార్చాలంటే 5000 రూపాయలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు.. చేసేది లేక అక్షరాల 5000 రూపాయలు ముడుపులు మొట్ట చెప్పాడు యువరాజు.. శ్వేత అనే ఓ విద్యార్థిని తన ఆధార్ కార్డులో డేటాఫ్ బర్త్ ను మార్చుకోవడానికి వెళ్లగా.. ఆమె వద్ద నుంచి 2000 రూపాయలు వసూలు చేసినట్లు చెప్పింది. భువనగిరి రెడ్డి సుస్మిత అనే విద్యార్థిని ఆధార్ లో పేరు మార్పు కోసం వెళ్లగా తన వద్ద నుంచి 2,800 రూపాయలు వసూలు చేసినట్లు వాపోయింది..

ఇలా ఒకరిద్దరు కాదు ఎంతోమంది ఆధార్ కార్డులో మార్పులు చేర్పుల కోసం వెళ్లి అధిక మొత్తంలో డబ్బులు చెల్లించడం జరుగుతుంది. సాధారణంగా ఆధార్ లో మార్పుల కోసం 50 రూపాయలు చెల్లించాల్సి ఉంది. అయితే, రాజంపేటలోని ఆధార్ నిర్వాహకులు మాత్రం అందిన కాడికి దోచుకుంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. మరికొందరు ఆధార్ సెంటర్ యజమానులు.. ఇక్కడ లేకున్నా ఇతరులకు తమ ఆధార్ సెంటర్‌లను అప్పగించి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ఆధార్ సెంటర్ లపై అధికారుల నిఘా కొరవరడం పర్యవేక్షణ లేకపోవడంతో సెంటర్ల నిర్వాహకులు ఇస్థారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

అసలు ఆధార్ సెంటర్లకు అనుమతులు ఉన్నాయా లేవా..? ఎవరి పేరుతో అనుమతులు ఉన్నాయి..? ఎవరు వాటిని నిర్వహిస్తున్నారు..? అన్నదానిపై అధికారుల నిఘా కొరవడింది.. దీంతో ఆధార్ యజమానులు ఆడిందే ఆటగా వేలకు వేలు దోచేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు ఇప్పటికైనా స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి.. అక్రమ పాల్పడుతున్న ఆధార్ సెంటర్లకు కళ్లెం వేయాలని ప్రజలు కోరుతున్నారు…..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page