Drunk and Driving is Punished : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడిన ఒకరికి రెండు రోజులు ట్రాఫిక్ డ్యూటీలు శిక్ష

TRINETHRAM NEWS

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడిన ఒకరికి రెండు రోజులు ట్రాఫిక్ డ్యూటీలు శిక్ష

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మద్యం సేవించి వాహనాలు నడిపిన మందుబాబులకు పెద్దపల్లి న్యాయమూర్తి మంజుల తీర్పు నిచ్చారు. శుక్రవారం వాహనాల తనిఖీల్లో మద్యం సేవించి పట్టుబడ్డ 20 మందిని పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు స్థానిక కోర్టులో హాజరు పరిచారు. వారిని విచారించిన న్యాయమూర్తి మంజుల 20 మందికి 23 వేల రూపాయల జరిమానా విధించారు. అయితే అత్యధికంగా మద్యం సేవించి వాహనం నడిపిన కమాన్ పూర్ కు చెందిన ఇందారపు రమేష్ కు 500 రూపాయల జరిమానా తో పాటు సామాజిక సేవలో భాగంగా రెండు రోజులపాటు ట్రాఫిక్ విధులు నిర్వహించాలని తీర్పునిచ్చారు. శని, ఆదివారాల్లో రమేష్ ట్రాఫిక్ విధుల్లో ఉపయోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు.* మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top