WhatsApp Image 2024 11 09 at 07.11.10
మలుపు తిప్పిన వరుణ్ చక్రవర్తీ.. సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం..!!
Trinethram News : సౌతాఫ్రికా పర్యటనను టీమిండియా విజయంతో ప్రారంభించింది. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య సౌతాఫ్రికాను ఓడించింది.
ముందుగా బ్యాటింగ్‌లో సంజూ శాంసన్ సత్తా చాటగా.. బౌలింగ్‌లో వరుణ్ చక్రర్తీ దుమ్మురేపాడు. ఒకే ఓవర్‌లో డేంజరస్ బ్యాటర్లు డేవిడ్ మిల్లర్, హెన్రీచ్ క్లాసెన్‌లను పెవిలియన్ చేర్చి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజూ శాంసన్(50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 107) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. తిలక్ వర్మ(18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) దూకుడుగా ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయిట్జీ(3/37) మూడు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, పీటర్, క్రుగర్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. హెన్రీచ్ క్లాసెన్(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25), ర్యాన్ రికెల్టన్(11 బంతుల్లో3 ఫోర్లు, సిక్స్‌తో 21), గెరాల్డ్ కోయిట్జీ(11 బంతుల్లో 3 సిక్స్‌లతో 23) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(3/25), రవి బిష్ణోయ్(3/28) మూడేసి వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్‌కు ఓ వికెట్ దక్కింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
