జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 08 at 19.58.35

TRINETHRAM NEWS

సాయి సుదీక్షకు 34 వ నెల చెక్ ను అందజేసిన సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్ గాంధీనగర్ కు చెందిన గద్దల సాయి సుదీక్ష కు ప్రతినెల 2000 రూపాయలు ప్యాకెట్ మనీ ఇస్తున్న విషయం తెలిసిందే అందులో భాగంగా శుక్రవారం రోజున సాయి సుదీక్ష తండ్రి గద్దల అనిల్ కుమార్ కు 2000 రూపాయల చెక్ ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేసినట్లు మడిపెల్లి మల్లేష్ తెలిపారు అనంతరం మల్లేష్ మాట్లాడుతూ సేవా స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులందరి సహకారంతో సాయి సుదీక్ష కు గత 34 నెలలుగా 2000 రూపాయలు ప్యాకెట్ మని ఇవ్వడం జరుగుతుందని సభ్యులందరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు మల్లేష్ తెలిపారు దాదాపు
మూడు సంవత్సరాల క్రితం మొదటి చెక్ ఇచ్చే సమయంలో అమ్మాయి చదువు పూర్తి అయే వరకు ప్రతి నెల రెండు వేల రూపాయలు ప్యాకెట్ మని ఇస్తా అని మాట అయితే ఇస్తున్నా ఇది సాధ్యం అవుతుందా అనుకున్నా కానీ మా ఫౌండేషన్ సబ్యులందరి సహకారంతో 34 నెలలు ఒక ఉద్యమం లాగా మాట ఇచ్చి మడమ తిప్పని పోరాటం లాగా సాయి సుదీక్ష కు ప్రతి నెల ప్యాకెట్ మని ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని మా ఫౌండేషన్ సబ్యులు కాకున్నా సోషల్ మీడియాలో చూసిన మనసున్న మహారాజులు కూడా చేయూతను ఇచ్చారని ప్రతి ఒక్కరికీ సాయి సుదీక్ష తరుపున మరియు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ అన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page