జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 08 at 19.06.24

TRINETHRAM NEWS

రామగుండం నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలి

రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని తెలంగాణ రాష్ట్ర ప్రజలతోపాటు రామగుండం నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామిని మనాలి ఠాకూర్ కోరుకున్నారు. రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆత్మీయులతో కలిసి ధర్మపురి లోని ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అర్చకులు, అధికారులు సాదర స్వాగతం పలికి, స్వామివారి చిత్రపటం తో పాటు ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు అందరూ అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాలనలో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చేస్తామన్నారు. ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page