జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 07 at 1.24.38 PM

TRINETHRAM NEWS

కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ నివాసానికి ఎన్యుమరేటర్లు స్టిక్కర్ అతికించారు.

Trinethram News : Medchal : రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య,ఉపాధి,రాజకీయ కుల సర్వే( సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లోని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ నివాసంలో ఎన్యూమరేటర్లు గోడకు స్టిక్కర్ ను అతికించారు.

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కులగణన చేయాలని ఉద్దేశంతో నవంబర్ తేదీలోపు కులగణనను పూర్తి చేయాలనే సంకల్పంతో ఉందన్నారు. ఈ సర్వే చేయడానికి ఇంటికి వచ్చిన అధికారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అండగా ఉండి ప్రతి కుటుంబం వద్ద సర్వే వివరాలను వివరించే విధంగా అధికారులకు సహకరించాలన్నారు.

అనంతరం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని పలువురు నాయకులు, పలు కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి, వివిధ కాలనీలలో సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. పలు వినతులు స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే వాటి పరిష్కారం కోసం, కాలనీల అభివృద్ధి కోసం సత్వర చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. పలువురు మాజీ ఎమ్మెల్యే కి పలు శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు అందజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page