జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 05 at 6.37.06 PM

TRINETHRAM NEWS

కాంగ్రెస్ నేత కూన శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో రాహుల్ గాంధీ కి ఘనంగా స్వాగతం పలికిన కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ శ్రేణులు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణనను అభినందిస్తూ ప్రజాప్రతినిధులు, కుల సంఘాల మేధావులతో బోయిన్పల్లి లోని గాంధీయన్ ఐడియాలజీ సెంటర్ లో నిర్వహించిన సదస్సుకు హాజరైన ఏఐసీసీ అగ్రనేత గౌరవ శ్రీ రాహుల్ గాంధీ కి స్వాగతం పలికేందుకు…మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి గాజులరామారం 125 డివిజన్ కంటెస్టడ్ కార్పోరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో బోయిన్ పల్లి లోని శ్రీలత గార్డెన్ కు చేరుకున్న రాహుల్ గాంధీ కి ఘన స్వాగతం పలకడం జరిగింది. రాహుల్ గాంధీ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనను చేపడుతూ.. దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తుందని కూన శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఆకాంక్షలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. పేద వర్గాలకు సామాజిక న్యాయం అందించే దిశగా పనిచేస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్ ఆగం పాండు, ఏనుగుల శ్రీనివాసరెడ్డి, ఎం.రాము గౌడ్, ఐఎన్టీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ గుంజ శ్రీనివాస్, దాబా శీను, ఓరుగంటి కృష్ణ గౌడ్, రషీద్ బేగ్, మహమ్మద్ ఖాజా భాయ్, జాహింగిర్ బాయ్, సిహెచ్.బుచ్చిరెడ్డి, బాలప్ప, ఐలయ్య గౌడ్, బేకు శ్రీను, శ్రీకాంత్ రెడ్డి, రషీద్ భాయ్,, పాల రవి,చాంద్ భాషా, సంతోష్, నర్సింగరావు, గంగారం, లాల్ మహమ్మద్, రమణా, పుల్లం రాజు, డాన్ శీను, నారాయణ బండారు, హరినాయక్, తోకల శ్రీనివాస్, చోటు, మక్బుల్ బాయ్, జాహింగిర్ , జనార్దన్ పాల రవి , చక్రిలతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page