WhatsApp Image 2024 11 03 at 20.16.27
ఉచిత రక్త పరీక్షలు నిర్వహించిన లయన్స్ క్లబ్..
ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి: లయన్ మల్లికార్జున్
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం దుర్గా నగర్ కాలనీ వాసులకు ఉచిత మధుమేహ వ్యాధి నిర్దారణ రక్త పరీక్షలు నిర్వహించారు. అలాగే లయన్ ఆంజనేయులు సహకారంతో ఉచిత అల్పాహార వితరణ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు పి మల్లికార్జున్ మాట్లాడుతూ, గత మూడు వందల తొంబై తొమ్మిది రోజులుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వివిధ ఏరియాలలో ఉచిత అల్పాహారం అందజేస్తున్నామని తెలిపారు. పారిశ్రామిక ప్రాంతంలోనూ ప్రజలు వైద్యుల సూచనలు పాటించి ఆరోగ్యవంతులుగా ఉండాలని అందుకు తమ వంతుగా ఉచిత బిపి, షుగర్ రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతులుగా నిలువాలని కోరారు. 2వందల మందికి రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పి మల్లికార్జున్ తో పాటు ట్రెజరర్ పి గోవర్ధన్ రెడ్డి, జోన్ చైర్మన్ కె రాజేందర్, మీల్స్ ఆన్ వీల్స్ కోఆర్డినేటర్ బంక రామస్వామి, సీనియర్ సభ్యులు గుండ వీరేషం, తిలక్ చక్రవర్తి తో పాటు దుర్గా నగర్ కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
