జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 01 at 19.44.20

TRINETHRAM NEWS

తెలుగు వాళ్లు ఉన్నంతకాలం ఎన్టీఆర్ అనే పేరు చిరస్మరణీయంగా ఉంటుంది -గాలి భాను ప్రకాష్,
నగరి నియోజకవర్గ శాసనసభ్యులు.

తెలుగు వాళ్లు, తెలుగు నేల ఉన్నంతకాలం ఎన్టీఆర్ అనే పేరు చిరస్మరణీయంగా ఉంటుందని నగరి నియోజకవర్గ శాసనసభ్యులు
గాలి భాను ప్రకాష్ పేర్కొన్నారు.
అమెరికాలోని అట్లాంటా నగరంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖా మంత్రివర్యులు నారా లోకేష్ తో కలిసి ఎన్ఆర్ఐలు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గాలి భాను ప్రకాష్ మాట్లాడుతూ..
గతంలో మద్రాసీలుగా పిలువబడుతున్న తెలుగు వాళ్లకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత ఎన్టీఆర్ దే నని పేర్కొన్నారు.
ప్రాంతీయ పార్టీ పెట్టి కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కిందని వివరించారు.
అన్న ఎన్టీఆర్ వారసుడిగా నారా లోకేష్ రాష్ట్రమంతా తిరిగి యువగళం పాదయాత్ర చేసి అధికారంలోకి తీసుకువచ్చారని వివరించారు.
అమెరికాలో అన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయడం గొప్ప విషయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సహచర ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు, కాకర్ల సురేష్, టీడీపీ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు కోమటి జయరామ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page